

మన న్యూస్ తొండంగి/ రావికంపాడు.. (అపురూప్): పని ఆధారిత ప్రోత్సాహకాలంలో కోతలు విధించి నిర్దిష్టమైన జాబు చార్టు లేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోగ్య సంరక్షణ నిపుణులు (సిహెచ్ఓలు) ఆవేదన వ్యక్తం చేశారు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ) అనేది ఒక ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ముఖ్యంగా సేవలు అందని ప్రాంతాలలో, సమాజం మరియు ఆరోగ్య సంరక్షణ సేవల మధ్య వారధిగా పనిచేస్తారు. వారు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందిస్తారు, ఆరోగ్య విద్యను ప్రోత్సహిస్తారు. మరియు అట్టడుగు స్థాయిలో ప్రజారోగ్య కార్యక్రమాలను అమలు చేస్తారు. భారతదేశంలో, సిహెచ్ఓలు తరచుగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి, ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాలలో ( హెచ్ డబ్ల్యు సిలు) పనిచేస్తాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మరియు హెచ్ డబ్ల్యు సి లు, సిహెచ్వోలుగా గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పలు సమస్యలకు పరిష్కారం లభించట్లేదు అంటూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా ఎన్ హెచ్ ఎం పాలసీ ప్రకారం రావలసిన 23 శాతం పెంపుదల గత ప్రభుత్వంలో ఎన్ హెచ్ ఎం లోని అన్ని హోదాల వారికి వర్తింపజేసి కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ)/హెచ్ డబ్ల్యు సి లకు మాత్రమే వర్తింప చేయకుండా పని ఆధారిత ప్రోత్సాహకాలంలో కోతలు విధించి నిర్దిష్టమైన జాబు చార్ట్ లేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశపు మార్గదర్శకాల ప్రకారం ఆరు సంవత్సరాల పూర్తయిన సిహెచ్ఓ క్రమబద్దీకరణ 23% పెంపుదల నిర్దిష్టమైన జాబు చార్ట్ జీతంతో పాటు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్) ప్రతినెల క్రమం తప్పకుండా రావాలని, రావలసిన ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్) అన్ని తక్షణమే చెల్లించాలని ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనియెడల శాంతియుత నిరసనలు చేపడుతూ హక్కుల సాధన నెరవేరేవరకు సిహెచ్ఓ లు నిరసన కొనసాగుతాదని ప్రభుత్వానికి తెలియజేస్తూ న్యాయం కోరారు.