

మనన్యూస్,శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ బస్తీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ మరియు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పారిశుధ్య పనులు క్రమంగా నిర్వహించడం లేదని, ఓపెన్ డ్రైనేజీ చెత్త నిండిపోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని, బస్తిల్లో పలు చోట్ల స్ట్రీట్ లైట్లు లేక చీకట్లో నడవాల్సిన పరిస్థితి నెలకొందని కార్పొరేటర్ గారి దృష్టికి తెచ్చారు. పలు సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోగా, మరికొన్నింటిని త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.అధికారులకు, కాంట్రాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేటర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం బ్రిజేష్, డిజిఎం నరేందర్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సోమదాస్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్, శ్రీకాంత్, గఫర్, సాయికిరణ్ గౌడ్, మహేష్, సుధాకర్ రెడ్డి, నర్సింహా, సత్యనారాయణ, నరసింహ, నర్సింహా రెడ్డి, దస్తగిరి, రజాక్, అలీ, శ్రీనివాస్, అశోక్, రేణు, రమేష్, నాగేశ్వర్రావు, రామకృష్ణ, శేషరావు, ప్రవీణ్, గౌతమ్, గిరిజ, లక్ష్మి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.
