

మనన్యూస్,తిరుపతి:ప్రజా రవాణా శాఖలో అక్రమ సస్పెన్షన్ లను, అక్రమ రిమూవల్ లను వెంటనే ఎత్తివేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి డిపో ఎదుట ప్లకార్డులను చేతపట్టి నిరసన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు మాట్లాడుతూ 1/19 జీవోను అమలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ హెచ్ ఎస్ స్థానంలో పాత వైద్య సేవలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా మాజీ జోనల్ అధ్యక్షులు డివిఆర్ కుమార్ మాట్లాడుతూ ప్రజా రవాణా శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రోజురోజుకు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సతీష్, రీజనల్ కమిటీ నాయకులు, తిరుపతి డిపో చైర్మన్ రమణయ్య, అధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి దాము, తిరుమల డిపో ఎన్ఎంయు చైర్మన్ నేతాజీ, అధ్యక్షులు వి వి కె నాయుడు, కార్యదర్శి రమణయ్య రఘుపతి ఉద్యోగులు పాల్గొన్నారు.
