జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం

మనన్యూస్:సుప్రీం కోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ,తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను పలు విభాగలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ లకు అవార్డుల ప్రదానం చేస్తుంది. (2024-2025)సంవత్సరానికి గాను ఈ అవార్డుల జాభితాను టి జె ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు తాజాగా ప్రకటించారు. ఈ సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్వులైన పలువురు జర్నలిస్టుల 100 మంది పేర్లను ప్రకటించగా తెలంగాణ రాస్ట్రం హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త రాపోలు లింగస్వామిని మనవీయ కోణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్ట్ గా ఎంపిక అవ్వడం జరిగింది. విజయవాడ లో తుమ్మలపల్లి కలక్షేత్రంలో తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ (మాజీ) హాజరై నిర్వాహకులతో కలిసి రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం, ప్రశంశ పత్రం, 5000 రివార్డు, శాలువా తో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విలువలరో కూడిన పాత్రికేయులకు సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందన్నారు.అప్పట్లో తాను కూడా పాత్రికేయు రంగంలో పనిచేసిన అనుభవాలతో కూడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.పాత్రికేయ రంగం పై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో విలువలతో కూడిన ఉత్తమ జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారం తో సత్కరించిన తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాక్షించారు. సామాన్య మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన రాపోలు లింగస్వామి హైదరాబాద్ లో జర్నలిస్ట్ గా పని చేస్తూనే ఆర్ టి ఐ, సామజిక కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు నిరంతరం కృషి కి ఫలితంగా గతంలో పలు అవార్డులు, ప్రముఖుల నుండి ప్రశంసలు, సమాజంలో తన కంటూ ఒక ప్రత్యేకత ను చాటుకుంటున్న రాపోలు లింగస్వామి కి తాజగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్ట్ ల జాభితాలో మానవీయ కొణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్ట్ గా ఉగాది పురస్కారం ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ (మాజీ)చేతుల మీదుగా అందుకోవడం తో అతని సేవలను గుర్తు చేస్తూ పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!