ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం మధ్యాహ్నం మరికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉంటే నేరుగా ఆఫీస్ లో సంప్రదించవచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ లో రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ అత్యంత బాధ్యతాయుతమైన వ్యవస్థ అని ప్రతి ఒక్కరు అంకితాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా భౌతిక సాక్షంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని తెలియజేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దొంగతనాల నిర్మూలన కొరకు నిఘా ఏర్పాటు చేయాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రహదారి వెంట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై, 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు తీసుకొచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రతా, భరోసా కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలని ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ – 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీ షీటర్స్, కేడీలు, సస్పెక్ట్ ఇళ్లను తనిఖీ చేయాలని, పాయింట్ బుక్స్ ను తనిఖీ చేయాలని గ్రామాలలో ప్రధాన కూడళ్ల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలని నేరాల నివారణకు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ ఐ రాము, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!