వైకాపా హయాంలోనే తిరుపతి తిరుమల దేవస్థానాల ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారు…తితిదే మాజీ ఛైర్మెన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

మన న్యూస్,గూడూరు,ఏప్రిల్13:తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఆదివారం నాయకులతో కలిసి మీడియా తో మాట్లాడుతూ…..గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ కరుణాకర్ రెడ్డి వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే YCP హయాంలో తితిదే ప్రతిష్ఠను పూర్తిగా దిగజార్చి నేడు సస్పెండయిన హరినాథరెడ్డి అనే అధికారి కోసం తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.ఎక్కడో చనిపోయిన ఆవుల ఫొటోలు చూపిస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు’ అలాగే తితిదే గోశాలను 266 మందికి పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ట్యాగింగ్ తో ఆవులను సంరక్షిస్తున్నారు, గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు.తప్పుడు కథనాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ‘సాక్షి’ పత్రిక.కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రలో ఇదంతా ఓ భాగం’తిరుమలలో అన్యమత ప్రచారానికి తెరలేపింది మీరు కాదా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, శ్రీవారి డాలర్ల మాయంలాంటి అనేక సంఘటనలు జరిగాయి అని అన్నారు.కరోనా సమయంలో శ్రీవారి లడ్డూలను దారి మళ్లించారు.తిరుమల బస్సు టికెట్లపై అన్యమతానికి సంబంధించిన చిహ్నాల్ని ముద్రించేలా చేశారు అని తెలియజేశారు.అసలు ఏడుకొండలు కాదని, అయిదు కొండలేనంటూ కుట్రలు చేశారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం పవిత్రతను మంటగలిపారు. ఇవన్నీ వాస్తవాలు కావా?’ ‘తాను నాస్తికుడినని కరుణాకర్ రెడ్డి గతంలో స్వయంగా ప్రకటించుకున్నారు. చివరికి దేవుడిని కూడా వదలకుండా వైకాపా వారు నీచ రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.తిరుమలకు వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాల్ని ప్రత్యేక్షంగా చూసే అవకాశం కల్పించాలని తితిదే ఇప్పటికే యోచిస్తోంది.భక్తులు వదంతులను నమ్మవద్దు’ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్పై కూడా ఇదే తరహాలో తప్పుడు ప్రచారం చేశారు తెలియజేశారు.సహజంగా మరణించిన ఆవులకు పోస్ట్ మార్టం చేయరని, తితిదే పవిత్రతను కాపాడేందుకు ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి, కోట మండల నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి మరియు తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..