మన న్యూస్,: గల్లా అరుణ కుమారి జీవిత కథపై వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నాను ,గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి మాజీ ఎంపీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్ర మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి కథ రచయిత మాజీ పార్లమెంటు సభ్యులు విజయేంద్రప్రసాద్ తెలిపారు ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామానికి విచ్చేశారు, ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి , రామచంద్ర నాయుడు ,మాజీ ఎంపీ గల్లా జయదేవ్, రమాదేవి వారికి ఘన స్వాగతం పలికారు అనంతరంరాజన్న పార్కుకు చేరుకుని మాజీ ఎంపీ దివంగత రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు… అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి గారి స్వీయ జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని తాను తాను చదవడం జరిగిందని ఆమె చరిత్ర తనను ఆలోచింప చేసిందని పేర్కొన్నారు.. మంచి తండ్రికి కూతురుగా, మంచి భర్తకు భార్యగా, మంచి పిల్లలకు మంచి తల్లిగా, ప్రజలకు మంచి సేవలు అందించే నాయకురాలిగా ఎదిగిన అరుణమ్మ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు… అరుణమ్మ జీవిత స్వీయ చరిత్ర లోని అంశాలు ఎలాంటి అబద్ధం, కల్ముషం లేకుండా ఉందన్నారు.. గల్లా అరుణ కుమారి కుటుంబం అనుమతి ఇస్తే గల్లా అరుణ కుమారీ జీవిత కథ సినిమా కంటే వెబ్ సిరీస్ రూపంలో మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.. ఈ సందర్భంగా దిగువమాగం గ్రామంలో గల్లా అరుణ కుమారి ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించారు ..ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి చేస్తున్న సేవలు తనను ఎంతో ప్రభావితం చేసిందని ప్రశంసించారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *