
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్-2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలోను అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు.సీనియర్ ఇంటర్ Bi.P.C విభాగంలో కె. యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది.సీనియర్ ఇంటర్ M.P.C విభాగంలో బి.వి. చరణ్ రెడ్డి యస్. శ్రావణి 1000 మార్కులకు 988 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచారు.H. యశస్విని , షేక్ గుల్ షన్ ఆరా 987 మార్కులు, పఠాన్ అయేషా, సుధాలాస్య, శశిరేఖ 986 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.జూనియర్ M.P.C విభాగంలో కె.స్వాతి శ్రీనిధి 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది.షేక్ సోనియా 470 మార్కులు గాను 464 మార్కులు, అలానే D. స్పందన , A. పవన్ కుమార్ V. వర్షిత, VR లక్ష్మి 463 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారు. C. అంబికా సాయి చేతన, బిందుశ్రీ 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.జూనియర్ M.E.C విభాగంలో పి. కిరణ్ కుమార్ 500 మార్కులకు 480 మార్కులతో టాపర్ గా నిలిచాడు. అలానే జూనియర్ C.E.C విభాగంలో సుమన్ సోలంకీ 500 మార్కులకు 478 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచాడు.అలానే జూనియర్ ఇంటర్ M.P.C విభాగంలో 460 మార్కులకు పైన 36 మంది విద్యార్థులు, 450 మార్కులకు పైన 79 మంది విద్యార్థులు సాధించారు. సీనియర్ M.P.C విభాగంలో 980 మార్కులకు పైన 19 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైన 59 మంది విద్యార్థులు సాధించారు.నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి గారు తెలిపారు.అన్ని గ్రూవులలోను స్టేట్ టాప్ మార్కులు సాధించడం కృష్ణచైతన్య విద్యాసంస్ధలకు మాత్రమే సాధ్యమని డైరక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తెలియజేశారు.అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డైరక్టర్లు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.విద్యార్థులకు స్వీట్లు పంచి, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
