తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్*

తవణంపల్లి, నవంబర్ 14 :మన న్యూస్

పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిశర ప్రాంతాలు, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి. డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సీఆర్. పి.సి., తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. స్టేషన్ లోని క్రైమ్ రికార్డ్స్ ను, కేసు డైరీ మరియు రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన, కేసుల్లో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నిర్దేశిత కాల వ్యవధిలో కోర్ట్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, సమర్థవంతమైన ట్రయిల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చెయ్యాలని సూచించారు. సివిల్, భూ తగాదాలు, పాత గొడవల్లో అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించి బైండోవర్ చెయ్యాలని సూచించారు. అదే విధంగా పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హోటల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని, అదే విధంగా రాత్రి మరియు పగల బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. అదే విధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, 174 సీఆర్. పి.సి. కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, భూ వివాదాలు, పాత గొడవలు మొదలైన వాటిని లిస్ట్ అవుట్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా పోలీసులు ఇంటింటికి వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలు, కొత్త చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా వారి పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పై దృష్టి పెట్టాలి. అంతేకాకుండా సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్ ల మోసాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో నేరాలపై అవగాహన చేయాలి.పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు తగు సూచనలు చేసారు.అనంతరం స్టేషన్ సిబ్బంది తో మాట్లాడుతూ వారి ఉద్యోగ భాద్యతలను వివరించి ప్రజలతో ఎలా మెలగాలి అనే దానిపై సూచించారు. పోలీసు స్టేషన్ సిబ్బంది కి సంబంధించిన సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్య లను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్.ఐ. చిరంజీవి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు