

ఐరాల – నవంబర్ 13 :మన న్యూస్
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నబి. సురేంద్ర బాబు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు,గత 15 సంవత్సరము లుగా ఉపాధ్యాయుని గా తన వంతు కృషి చేసి విద్యార్థులకు ఎనలేని సేవలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు ని అందజేశారని ఆయన తెలిపారు,ఈ సందర్భంగా తనతో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులుసురేంద్ర బాబును అభినందించారు,ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతగా ఉపాధ్యాయ వృత్తిలో పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యతగా ఉండి వారి భవిష్యత్తును ఉన్నత స్థాయిలో ఉండేలా వారిని తీర్చిదిద్దుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్. చంద్రశేఖర్ నాయుడు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బి. సురేంద్రబాబును ఎం. సోమశేఖర్ నాయుడు, ఎస్. మహమ్మద్ హసీమ, టి. శాంత దేవి, టి. విజయలక్ష్మి, పి.గీత, ఏ. వాణి, ఆర్. మాధవరెడ్డి, సి. రాజీవ్ గాంధీ, సి. నరేష్ బాబు తదితరులు అభినందించి పాల్గొన్నారు.