

మనన్యూస్:నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన,ప్రజాపాలన ప్రగతి బాట’కార్యక్రమంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ ఆద్వర్యంలో మంగళవారం రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో DCC జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి నర్వ మండల అధ్యక్షులు చెన్నై సాగర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, జక్కన్న పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
