గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు

మన న్యూస్ : వారోత్సవాలు ఉత్సాహ భరితంగా అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్అభినందించ జ్యోతి ప్రజ్వలన, చిత్రపటాలకు పూల మాలలు భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని, ఆ దేవాలయాలపై ఆధారపడి చదువులు సాగించిన వారి జీవితాలు సుంధరమయంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభిప్రాయపడ్డారు. గురువారం స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసిన ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాత, గ్రంథాలయాల పితామహుడు ఎస్ఆర్ రంగరాజన్, చాచా నెహ్రు చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞానభాండా గారాలని చెప్పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు జరిపించుకోవడం అభినందనీయమని అన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉత్సాహ భరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తు చిన్నారులు హాజరు కావడం అభినందనీయమని, వారంతా వుస్తకాల విలువను తెలుసుకోవాలని, వుస్తక వఠనం ద్వారా జీవన విధానం, బ్రతుకు చిత్రం మారుతుందని చెప్పారు. చదువొక్కటే మనిషి మనుగడను మార్పు చేస్తుందని తెలిపారు. వుస్తకాల్లోని తెల్లని కాగితాల్లో ఉండే అక్షరాలను సాధారణంగా లెక్క పెట్టక, ఆకాశంలోని నక్షత్రాల వంటి వెలుగు చుక్కలుగా చూడాలని, ఆ అక్షర నక్షత్రాలే తలరాతలను మార్చి జీవితాలను వెలిగిస్తాయన్నారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం చదవడం వదులుకోవద్దని భావించాలని చెప్పారు. వారోత్సవాలను పురస్కరించుకుని వలు కార్యక్రమాలు రూపకల్పన చేశారని, వాటిని తూచా తప్పకుండా నిర్వహించి చిన్నారుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రోత్సహించాలని, తద్వారా వారిలోని మేధాశక్తి పెంపొంది దేశానికి ఉపయోగపడటమే కాకుండా, సమాజ జాగృతి వరుస్తారని తెలిపారు. పిల్లలు చదువుల్లో పోటి తత్వం, ఆలోచన శక్తి పెరిగే విధంగా మార్పు తెచ్చేందుకు ఈ వేదిక ద్వారా ప్రయత్నించాలని సూచించారు. వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయని, వేదికతో పాటు వీక్షకులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు సిబ్బంది కృషి చేయడం అభినందనీయం అన్నారు. అనతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనను చూసిన కలెక్టర్ వారిని అభినందిస్తూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అంతా చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అదిరోహించాలని ఆకాంక్షించారు. నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పరు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శేషాంజన స్వామి, గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకురాలు జి మణి మృదుల, జిల్లాలోని గ్రంథపాలకులు మధు బాబు, వంశీ, జానీ, వాణి, రుక్మిణి,గీత తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు