మన న్యూస్ : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలనీ గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన సీనియర్ నాయకులు,కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డు పనులు,యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని,మంచి నీటి వసతిని మెరుగుపర్చాలని, విధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడలని,పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరారు. ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని,గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని.దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు రాజు నాయక్, శ్రీనివాస్, రఘురాం రెడ్డి,కట్టెల శ్రీను, శ్రీనివాస్, మురళీ మోహన్ చౌదరి, రమేష్,నరేందర్ యాదవ్, యేసు దాస్ కలియ నాయక్, కృష్ణ, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.