

శ్రీ కాళహస్తి నవంబర్ 14 మన న్యూస్
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మొన్న గిరిజన బాలికల హాస్టల్ సందర్శించినప్పుడు కొన్ని సమస్యలు వినుత తెలపడం జరిగింది. సమస్యలను జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పరిష్కారం కొరకు లెటర్ రాయడం జరిగింది. అత్యవసరంగా ఉన్న స్ట్రీట్ లైట్లు సమస్య ను పరిష్కరించేందుకు వినుత కోటా తన సొంత ఖర్చుతో హాస్టల్ కి 6 స్ట్రీట్ లైట్లు ఈరోజు వితరణ చెయ్యడం జరిగింది. హాస్టల్ లో ఉన్న బాలికలు సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా ఒక కంప్లైంట్ బాక్స్ కు ఏర్పాటు చెయ్యడం జరిగింది. పార్టీ నాయకుల ద్వారా లైట్లు, కంప్లైంట్ బాక్స్ ను ప్రిన్సిపాల్ గారికి అందజేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా స్కూల్ విద్యార్థినులకు స్వీట్లు, చాక్లెట్స్ పంచిపెట్టడం జరిగింది.
కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, జ్యోతి రామ్, రాజ్య లక్ష్మి, కవిత, రవి కుమార్ రెడ్డి, డుమ్ము రాయల్ ,వెంకటరమణ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ కార్యాలయం
శ్రీకాళహస్తి నియోజకవర్గం