

కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా
మనన్యూస్,చైతన్యపురి:డివిజన్లోని రేషన్ షాపులను సందర్శించిన బిజెపి
కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి
చైతన్యపురి డివిజన్ లొ ఉన్న రేషన్ షాపులను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యంని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సన్న బియ్యం 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందిఅని.ఒక్క కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలజేయడం జరిగింది. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు అని ముందుగా ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆరు గ్యారెంటీలు అమలు పరచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
వినోద్ యాదవ్, డివిజన్లోని బిజెపి కార్యకర్తలు , తదితరులు పాల్గొనడం జరిగింది…
