
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామ గిరిజన ప్రాంతం అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనులు పరిమితడక గ్రామంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాలుగా మర్రివీడు గ్రామ నీకి చెందిన సఖిరెడ్డి బుజ్జి అలియాస్ కర్రి బుజ్జి అనే వ్యక్తి అటవీ సంపదను దొంగచాటుగా దోచుకుపోతున్నారంటూ అన్నీ గిరిజనులు ఆరోపించారు. గిరిజనులు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మాపై కేసులు బనాయించి గిరిజనుల అయిన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరుడు వచ్చి ఇక్కడ ఉన్న గిరిజనుల పై పెత్తనం చలాయించడం మాలో మాకే విభేదాలు సృష్టించి ఇక్కడ గిరిజనులతో సత్సంబంధాలు పెట్టుకుని గిరిజనులు ఎదురు తిరిగితే వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను విరవించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని అప్పటికి న్యాయం జరగకపోతే అటవీశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరివీడు గ్రామ సర్పంచ్ నానిశెట్టి శంకురమ్మ,నానిశెట్టి లోవరాజు,మూలపర్తి రాంబాబు,నాగులపల్లి సంకురు, మడవాడ అమ్మాజీ, నానిశెట్టి సత్తిబాబు, నాగులపల్లి అర్జున, సోమల సూర్యారావు, బంటుపల్లి చిలకమ్మా, కూడా రాజులమ్మ, సాదే వీరమ్మ, బంటుపల్లి వెంకయ్యమ్మ, ముచ్చర్ల రవణమ్మ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.