
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్);
ఏలేశ్వరం నగర పంచాయతీలో స్థానిక లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా ఆదేశాల మేరకు, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వైభోగుల సుబ్బారావు, అలమండ వీర రాఘవ, బెల్లాని శ్రీను, మాజీ కౌన్సిలర్ బూర్లు సత్తిబాబు,తదితరులు మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, 1982 నుండి ఇప్పటివరకు అనగా 40 మూడు సంవత్సరాలుగా కార్యకర్తల అకుంఠిత దీక్షతో ఎదిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి నాయకుల మరియు కార్యకర్తల నోర్లు తీపి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో,బూర్లు సత్తిబాబు, వైభోగుల సుబ్బారావు,కడింశెట్టి వాసు, బంక రాజు, కాకాడ నాగేశ్వరావు, బెల్లానీ శ్రీను,శిడగం రామకృష్ణ, మామిడి శ్రీను, అలమండ వీర రాఘవరావు,శిడగం శ్రీను, మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.