
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు మూది నారాయణస్వామి,బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ శ్రేణుల సమక్షంలో పట్టణ అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించారు.నాయకులకు
కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా గోపి, నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పేదల పక్షాన పని చేస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాగు రాజేష్,జొన్నాడ వీరబాబు, కౌన్సిలర్లు పెండ్ర శ్రీను,కోణాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, రాయుడు చిన్నా,సామంతుల గోపి,గట్టెం పెదకాపు, అనంతారపు రాజు,రుచి రమేష్ అధిక సంఖ్యలో టిడిపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.