

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్)
:మండలంలోని లింగంపర్తి, సిరిపురం గ్రామాలలో శ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవములు శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య రోజున అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారని వారు అన్నారు.ఈ తీర్థ మహోత్సవంలో గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.