

మనన్యూస్,శంఖవరం:వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కొంతంగిలో రైతులకు వేసవిలో అపరాల సాగు,పచ్చిరొట్ట పంటల ఆవశ్యకత,వేసవి దుక్కులు ప్రాముఖ్యత,పి.ఎం కిసాన్,రైతుల రిజిస్ట్రేషన్,రాయితీపై యంత్ర పరికరాలు,ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకుడు తరుణ్,రైతులు పాల్గొన్నారు.
