

మనన్యూస్,శంఖవరం:మనం చేయించుకున్న పాలసీలే మనకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తాయని శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ అన్నారు.శంఖవరం స్టేట్ బ్యాంక్ లో మంగళవారం ఇటీవల ప్రమాదంలో మరణం పొందిన శృంగవరం గ్రామానికి చెందిన కొల్లు లోవసత్తిబాబు కు ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకంలో భాగంగా 2 లక్షల భీమాను లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఆర్థిక భద్రతకు భీమా తప్పనిసరిగా అవసరం అవుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నా హయాంలో పది పాలసీలు వరకు అందజేయడం జరిగిందని తెలిపారు. మనం సంవత్సరానికి పిఎమ్ జేజే బి వై ద్వారా 436 రూపాయిలు చెల్లిస్తే సహజ మరణం ద్వారా రెండు లక్షలు నామినికి వర్తిస్తాయని ఈ పథకం 18 నుంచి 50 సంవత్సరాల వారికి వర్తిస్తుందన్నారు. కార్యక్రమం లో డిప్యూటీ మేనేజర్ ప్రతాప్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
