జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు

వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక దృష్టి

మద్యం సేవించి వాహనాలు నడుపుతే చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

మనన్యూస్,కామారెడ్డి:నిజం సాగర్ చౌరస్తా మరియు నరసన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన టౌన్ పోలీస్ స్టేషన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ బృందాలు వాహనాల తనిఖీలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై మరియు ర్యాష్, మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర, అన్నారు,నిజాంసాగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న టౌన్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బందికి మరియు నరసన్నపల్లి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న దేవునిపల్లి ఎస్సై సీఐ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకోసం వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు, ఏట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌ నంబర్‌ సక్రమంగా లేని, నంబర్‌ ట్యాంపారింగ్ కలిగిన, నంబర్‌ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని పట్టుబడిన వాహనాలపై అయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి మరియు రోడ్డు నిబందనలు పాటించి సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///