నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు
వాహనాలు నడిపే మైనర్లపై ప్రత్యేక దృష్టి
మద్యం సేవించి వాహనాలు నడుపుతే చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
మనన్యూస్,కామారెడ్డి:నిజం సాగర్ చౌరస్తా మరియు నరసన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన టౌన్ పోలీస్ స్టేషన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ బృందాలు వాహనాల తనిఖీలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై మరియు ర్యాష్, మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర, అన్నారు,నిజాంసాగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న టౌన్ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బందికి మరియు నరసన్నపల్లి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న దేవునిపల్లి ఎస్సై సీఐ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకోసం వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు, ఏట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. లైసెన్సు, నంబర్ ప్లేట్ నంబర్ సక్రమంగా లేని, నంబర్ ట్యాంపారింగ్ కలిగిన, నంబర్ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని పట్టుబడిన వాహనాలపై అయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి మరియు రోడ్డు నిబందనలు పాటించి సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.