మన ధ్యాస మక్తల్:

ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించిందని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీను తెలిపారు. శుక్రవారంమక్తల్ మండలం గోలపల్లి గ్రామంలో జరిగిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అదికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన గ్రామస్థులకు ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రయోజనాలను వివరించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బీమా వర్తిస్తుందని తెలిపారు.మండలంలోని ప్రతి గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేసి దరఖాస్తు స్వీకరిస్తామని సర్పంచులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *