గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని వినతి

కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో కరకంబాడి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీలలో నెలకొన్న ప్రజా సమస్యలను సీపీఎం పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

గ్రామసభలో సీపీఎం పార్టీ ప్రస్తావించిన ప్రధాన సమస్యలు:

  1. ఇళ్ల స్థలాలు: కరకంబాడి పంచాయతీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి.
  2. ఎర్రగుట్ట భూములు: సర్వే నంబర్ 153/1లోని ప్రభుత్వ భూమిని గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
  3. తాగునీటి సమస్య: వివిధ కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించి నిరంతర నీటి సరఫరా కల్పించాలి.
  4. మౌలిక సదుపాయాలు: రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
  5. ఇళ్ల పట్టాలు: సుందరయ్య కాలనీతో పాటు ఇతర కాలనీల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి.
  6. శ్మశాన వాటికలు: తారక రామా నగర్, రాజీవ్ గాంధీ కాలనీల్లోని శ్మశాన వాటికలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలి.
  7. ప్రజా సేవలు: కాలనీల్లో రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించాలి.
  8. ప్రభుత్వ భూముల సర్వే: పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ఇనాం, గడ్డి భూములను సర్వే చేసి భూముల వివరాలను ప్రజలకు తెలియజేయాలి.

గ్రామసభలో ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి, అర్హత మరియు నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని సీపీఎం నాయకులు పి. రాజశేఖర్ ,సత్యశ్రీ, దీప, హేమంత్, శివనాధం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *