రాష్ట్రస్థాయి పోటీలకు గోల్డ్ మెడల్ విజేతల ఎంపిక

జెడ్పీహెచ్ఎస్, ఎం.ఆర్.పల్లి, తిరుపతిలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ తైక్వాండో టోర్నమెంట్ 2026–27లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అండర్-14, అండర్-17 మరియు అండర్-19 విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

బాలుర విభాగంలో:కనిష్క్ (6వ తరగతి) – గోల్డ్ మెడల్,
సాయి ధర్మ తేజ్ (6వ తరగతి) – సిల్వర్ మెడల్,జ్ఞానేశ్వర్ (7వ తరగతి) – సిల్వర్ మెడల్,మస్తాన్ (9వ తరగతి) – సిల్వర్ మెడల్,ఇస్మాయిల్ (9వ తరగతి) – సిల్వర్ మెడల్,గీతమ్ (9వ తరగతి) – బ్రాంజ్ మెడల్,జ్ఞాన స్వరూప్ (9వ తరగతి) – బ్రాంజ్ మెడల్,హుస్సేన్ (8వ తరగతి) – బ్రాంజ్ మెడల్,నిహాస్ (7వ తరగతి) – బ్రాంజ్ మెడల్ సాధించారు.

బాలికల విభాగంలో:

క్యాథరిన్ (6వ తరగతి) – గోల్డ్ మెడల్,చాంచల్ చౌహాన్ (6వ తరగతి) – గోల్డ్ మెడల్,అలియా హబీబా (9వ తరగతి) – గోల్డ్ మెడల్,జ్వాల (9వ తరగతి) – సిల్వర్ మెడల్,జాహ్నవి (9వ తరగతి) – సిల్వర్ మెడల్,ఆఫియా (9వ తరగతి) – బ్రాంజ్ మెడల్,షబ్ను (8వ తరగతి) – బ్రాంజ్ మెడల్ సాధించారు.
అండర్-19 విభాగంలో:
షబ్నమ్ (10వ తరగతి) – గోల్డ్ మెడల్,ప్రదీప్ (10వ తరగతి) – గోల్డ్ మెడల్ సాధించారు.
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులందరూ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ పి. ఎ. ఖాన్ మరియు ప్రిన్సిపాల్ షహేర్ బాను విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల మరియు క్రీడా ప్రతిభను ప్రశంసిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ఈ విజయానికి కృషి చేసిన తైక్వాండో కోచ్ శ లోకేష్ పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *