
తవణంపల్లి, సెప్టెంబరు 29 – మన ద్యాస
పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఉత్తరబ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డీపల్లి గ్రామానికి ఉత్తరబ్రాహ్మణపల్లి నుంచి అనుసంధానంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ శంకుస్థాపన చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే వడ్డీపల్లి గ్రామ ప్రజలకు ఉత్తరబ్రాహ్మణపల్లితో అనుసంధానం మరింత సులభతరం కానుంది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, మాజీ అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ ఎం.ఆర్.సి. మోహన్ నాయుడు, ప్రవీణ్, సింగిల్ విండో చైర్మన్లు అమరేంద్ర నాయుడు,పాక్స్ చైర్మన్ రంజిత్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిట్టెమ్మ, అర్ధగిరి పాలకమండలి చైర్మన్ రఘు, సభ్యులు వినాయక, రాష్ట్ర తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ శరవణ కుమార్, మండల కార్యదర్శి మురళి, యూనిట్ ఇంచార్జిలు రఘు, ధనుంజయ నాయుడు, బూత్ కమిటీ అధ్యక్షులు పట్నం గోపి యాదవ్, శరవణ, జ్యోతి బాబు, శోభన్ బాబు, నాగరాజు, జ్ఞాను చౌదరి, సాగర్, మండల కార్యదర్శి గాంధీ, మాజీ కార్యదర్శి మధు, మైనారిటీ నాయకులు షబీర్ భాష, పార్టీ నాయకులు సోప్పా నాని, ఏకాంబరం నాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులు రవి పాల్గొన్నారు.అలాగే మండల స్పెషల్ ఆఫీసర్, ఏస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటరమణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఏ. రవికుమార్, ఏపీడీ బి. సుబ్రహ్మణ్యం, ఏం పి డి ఓ హరిప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ మాధవరాజు, ఈసీ రమ్య, సిబ్బంది, మండల స్థాయి అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారి వంటి మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టడం పట్ల వడ్డీపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సీసీ రోడ్డు నిర్మాణంతో తమ గ్రామానికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని వారు పేర్కొన్నారు.