కలిగిరి, సెప్టెంబర్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వద్ద జరిగిన ‘పల్లె పండుగ 3.0’ బహిరంగ సభకు కలిగిరి మండలం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.ఈ క్రమంలో సభకు వెళ్లే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కూటమి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలిగిరి పరిధిలోని జిర్రావారిపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్ద సభకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను ఆపి ప్రయాణీకులకు ఫుడ్ ప్యాకెట్లు, తాగునీటి బాటిళ్లను కలిగిరి ఎంపీడీవో ప్రత్యూష, టీడీపీ మండల కన్వీనర్ పూసాల వెంగపనాయుడు స్వయంగా పంపిణీ చేశారు.ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరికీ ఆహారం, నీరు అందేలా వారు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులు, నాయకులు కలిసి బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రయాణ ప్రాంగణంలోనే ఆహారం, తాగునీరు అందించడం పట్ల కలిగిరి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్లకర సతీష్, జిర్రా అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.