ఏర్పేడు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న “పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలంలో మంగళవారం అభివృద్ధి పనుల పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు.
రూ. 48.11 లక్షలతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం:
గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పేడు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు:పాగాలి: రూ. 27 లక్షలు,నచ్చనేరి: రూ. 16.67 లక్షలు కాట్రకాయలగుంట: రూ. 4.44 లక్షలు
నూతన బస్ షెల్టర్ ప్రారంభం:
అనంతరం ఏర్పేడు – వెంకటగిరి బైపాస్ రోడ్డు వద్ద ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి పల్లెను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు:
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, శివశంకర్ రెడ్డి, నైనూరు పున్నారావు, సూరి నాయుడు, మోహన్ నాయుడు, సుధాకర్ రెడ్డి, మురుగన్, యూనిట్ ఇంచార్జి రాఘవేంద్ర, బత్తల గిరి నాయుడు, గాలి క్రిష్ణవేణి, గుణా యాదవ్, చంద్ర శేఖర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జీలు కేశినేని సుబ్రమణ్యం, బాబు నాయుడు, రాచేటి సుబ్రమణ్యం, సీతాపతి ఆచారి పాల్గొంటారు.
అలాగే పిఎసిసి ఛైర్మన్ మహేష్ రెడ్డి, పార్థ సారధి, మునిరెడ్డి, రాజా, చంద్ర, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, , హరిరెడ్డి, సురేష్, వెంకయ్య, జగదీష్, నారాయణ, రామదాసులతో పాటు వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

