మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని నారాయణపేట రోడ్డులో మహీంద్రా షోరూమ్ సమీపంలోని ఎస్ వి ఎన్ లాడ్జ్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు దాడి నిర్వహించారు.మక్తల్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో లాడ్జి నిర్వాహకుడు/యజమాని పి. భాస్కర్ రెడ్డి, అతని సహాయకులు వులిగప్ప, నవాజ్తో పాటు 03 మంది పురుష కస్టమర్లు, 07 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో పోలీసులు కింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు:- 10 మొబైల్ ఫోన్లు- రూ.7,800 నగదు- 02 మోటార్ సైకిళ్లు- ఉపయోగించిన మరియు ఉపయోగించని కండోమ్ ప్యాకెట్లుఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ,ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదుపులోకి తీసుకున్న వారికి అవసరమైన కౌన్సెలింగ్ కూడా నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు, ముఖ్యంగా వ్యభిచారం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
