కొండాపురం, సెప్టెంబర్ 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కొమ్మి గ్రామ హరిజనవాడ యువత ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ నీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాట్లపై యువతతో ఆయన చర్చించారు. వినాయకుని విగ్రహం ఏర్పాటు మరియు పండుగ నిర్వహణ కోసం ₹19,000/- ఆర్థిక సహాయాన్ని చెరుకూరి నవీన్ యువతకు అందించారు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని నవీన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ దేవినేని వెంకటసుబ్బయ్య గారు మరియు కొమ్మి గ్రామ హరిజనవాడ యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *