మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) సెప్టెంబర్ 9 : పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కాటేపల్లి గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను తహసీల్దార్ రాజశేఖర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరవేయడంలో స్మార్ట్ రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నప్పటికీ సంబంధిత రేషన్ దుకాణంలో బియ్యం పొందే అవకాశం ఉందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందజేస్తోందని, దీనికి పేద ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందని తహసీల్దార్ తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆహార భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీపీఓ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, నాయకులు ఇస్మాయిల్ పటేల్, అశోక్ పటేల్, గంగాగౌడ్, హన్మాండ్లు, శంకర్, రాంచందర్, సాయిలు, రామప్ప, సంగన్న, చందర్, విఠల్, శ్రీను, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *