మన ధ్యాస మక్తల్: పట్టనంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో 1990-91 బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయులైనటువంటి రమేష్ శెట్టి , ఎం శివకుమార్ , మనోహర్ , ఎల్లప్ప & అరుణ టీచర్ లని ఘనంగా సత్కరించి చిన్ననాటి జ్ఞాపకాలను ఆ మాధుర్యాలను జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు యోగ క్షేమాలు తెలుసుకుని సంతోషంగా గడిపారు. చిన్న నాటి మిత్రులతో సమయం వెచ్చించడంతో. మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతామని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవిందాచారి, శివరాం, భీంరెడ్డి, బొందల్ కుంట రఘు, సత్యారెడ్డి, నగేశ్, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *