*కలిగిరి, అక్టోబర్ 23, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:*

నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయం నందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా *కలిగిరి పోలీసులు పటిష్ట బందోబస్తు* ఏర్పాటు చేశారు.ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కలిగిరి ఎస్ఐ లతీపున్నిసా ఆధ్వర్యంలో ఆమే సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా:
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తకుండా, నామినేషన్లకు వచ్చే అభ్యర్థులు, వారి అనుచరుల మధ్య తోపులాటలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఎంపీడీవో కార్యాలయం ప్రధాన గేటు వద్ద, లోపలి ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు.
*అప్రమత్తమైన కలిగిరి పోలీసులు:*
ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు కలిగిరి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతూ, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఎస్ఐ లతీపున్నిసా స్వయంగా రంగంలోకి దిగి బందోబస్తును పర్యవేక్షించారు.పోలీసుల సమర్థవంతమైన బందోబస్తు వల్ల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగిందని, నాయకులు స్థానికులు, అధికారులు అభిప్రాయపడ్డారు.
