మన ధ్యాస, నెల్లూరు, మార్చి 29 :నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గత 40ఏళ్లుగా మత్స్యకార గ్రామాల ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తోటయ్యతో తాను గత ఆరు నెలల నుంచి మాట్లాడలేదన్నారు. వీడియోలు తాను కూడా చూశానని, గట్టిగా అడగటంతోనే బిఎంఆర్ అని చెప్పాడన్నారు. తన అకౌంట్లో నుంచి గాని తన సన్నిహితుల అకౌంట్ల దగ్గర నుంచి గాని ఎవరికైనా డబ్బు ట్రాన్స్ఫర్ అయి ఉంటే నిరూపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. వివరంగా…….నాలుగు కరైకల్ బోట్లకు సంబంధించి రకరకాల వదంతులు రావడం జరిగినది అని అన్నారు.లోకేష్ పర్యటన ముందు రోజు వచ్చి జువ్వలదిన్నె ప్రాంతంలో చూసుకొని తరువాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దానివలన అక్కడికి వెళ్లడం జరిగినది అని అన్నారు .నేను కానీ మా సోదరుడు మీద రవిచంద్ర గాని సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలలో ఎటువంటి తగాదాలు లేవు,నేను ఏ పార్టీలో ఉండిన చాలా డిస్ప్లేనేడ్ గా ఉంటాను. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే మా ఇసుకపల్లి గ్రామ పెద్దకాపు తోటయ్య బంధించి రకరకాలుగా వాళ్ళ కట్టుబాట్లు ప్రకారం బోట్ల విషయంలో రూపుదిద్దుకున్నది అని అన్నారు.నేను నేరుగా మీడియా మిత్రుల ద్వారా మత్యకార సోదరులకు తెలియజేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.కావలి ఎమ్మెల్యే గాని, గ్రామాలకు సంబంధించిన వైసీపీ వారు మరియు టిడిపి వారు ఇద్దరితో కలిసి మీటింగ్ పెట్టడం జరిగినది,నేను ఆ గ్రామాలను నాలుగైదు సార్లు కూడా సందర్శించి మీటింగ్ పెట్టడం జరిగినది అని అన్నారు. మత్స్యకార గ్రామాల్లో ఎక్కడైనా వివాదాలు వచ్చినా గాని నన్ను పరిష్కరించమని ఆహ్వానిస్తారు అని అన్నారు.బోట్లు వివాదం గత 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది…తమిళనాడు వాళ్లకి చిన్న బోర్డులు ఉంటాయి అవి పులికాట్ సరస్సు మీద మన ఏరియాలోకి ప్రవేశిస్తాయి… పెద్ద బూట్లు కరైకల్ మరియు పాండిచ్చేరి వారికి మాత్రమే ఉన్నాయి… వారు ఏడు కిలోమీటర్ల అవతల వేట చేయాలి. కానీ వారు మన వద్ద సంపద ఎక్కువగా ఉన్నదని ఇక్కడ వేట చేయడం ఆ తరువాత మన మత్స్యకారులు వారిని పట్టుకుని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో నా ద్వారా గాని కాంగ్రెస్ పార్టీ అయినా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా గాని మధ్యవర్తిత్వం చేసి మన మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించేవారు అని తెలిపారు.ఈసారి వాళ్ల మధ్య సంపదను ధ్వంసం చేస్తున్న దాని వలన ఏ రాజకీయ పార్టీ వారు వచ్చిన గాని వదలకుండా వారి దీనికి పరిష్కారం చూసుకోవాలన్న ఆలోచనలో ఉండినారు.. 164 గ్రామాలు ఒక తీర్మానం చేసుకొని ఉండారు కాబట్టి మన దగ్గరికి వస్తే మనం ఏదైనా పరిష్కరించుకునే దానికి ఉంటుంది అని అన్నారు. నన్ను ఎవరు కూడా సంప్రదించను లేదు, ఎవరి కి కూడా ఫోన్ చేయలేదు. అనవసరంగా తల దూర్చకూడదు. మనల్ని అడిగినప్పుడు మనం మాట్లాడదాము అనుకున్నాను అని తెలిపారు.ఈ బోట్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ లు కూడా పోలీస్ స్టేషన్లో నమోదు అయి ఉన్నవి… పాండిచ్చేరిలో ఉన్న ప్రభుత్వము బిజెపికి సంబంధించి ఉన్నది అని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి నాతో ఈ సమస్య మీద పరిష్కరించమని చెప్పినట్టు రూమర్లు వచ్చినది…ఒకవేళ గౌరవ స్టాలిన్ మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు తోనే మాట్లాడుతారు అని అన్నారు.ఎందుకంటే ఒకప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కన్వీనర్ గా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు డిఎంకె వారు కూటమిలో ఉండినారు..లోకేష్ బాబు వచ్చినప్పుడు ఈ బోట్లు ఎందుకు ఉన్నాయి అని అడిగినట్టు, వాటిని పంపించేసిండి అని చెప్పినట్టు, నేను ఆరోజు రంగ ప్రవేశం చేసినట్టు, జువ్వలదిన్నె కాపుకు, ఇసుకపల్లి కాపుకు, కడలూరు కాపుకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు ఆ తర్వాత అదృష్టం అయిపోయినట్టు ఒక కట్టు కథ అల్లినారు. అది తరువాత తెలుస్తుంది అని తెలిపారు.తమిళనాడు నుంచి వచ్చిన వారు కావలి లాడ్జిలో దిగి ఒక నెల రోజుల నుంచి వాటికి స్థానికుల సహాయంతో రిపేర్లు చేసుకున్నారు. ఇది స్థానికుల సహకారం లేనిదే జరగదు..అక్కడ ముగ్గురు పోలీసు వారు కూడా ఉన్నారంట.. ఈ మత్స్యకారి గ్రామాలన్నీ కలిసి ఇసుకపల్లి కాపుకి తాళాలు ఇచ్చినారు అని అన్నారు. ఒక్కొక్క బోటు కి 1500 లీటర్లు డీజిల్ కావాలి. ఇవన్నీ అప్పటికప్పుడుకే జరిగింది కాదు..ఇది అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి ముఖ్యమంత్రి ని శాశ్వత పరిష్కారం కావాలి అని కోరుకుంటున్నాను. హై లెవెల్ కమిషన్ వేసి ఎంక్వయిరీ చేసి నిజాలు తేల్చడం చేయాలి. ప్రభుత్వాలను కూడా ఇరక పెడుతున్నారు కాబట్టి ఈ విషయంలో లోకేష్ బాబు ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అందుకు ముఖ్యమంత్రి ని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఆరోజు రాత్రి మత్స్యశాఖ మంత్రి కి రాజీవ్ రంజిన కి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బిఎంఆర్ కాల్ లిస్ట్ తీస్తే తెలుస్తుంది కదా లేదా బిఎంఆర్ అకౌంట్ చూస్తే తెలుస్తుంది కదా అంటున్నారు అని అన్నారు.ఇది కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు అది మీ అందరికీ తెలిసిందే అని అన్నారు.శ్రీరామచంద్రుడి సాక్షిగా చెప్తున్నా ఇయన్నీ అపోహలు. అందుకనే ఒక కమిటీని వేస్తున్నాము కొద్దిగా ఓపిక పట్టండి. ఆ కమిటీలు మత్స్యకారులు కూడా ఉంటారు ఎవరెవరు ఉండాలి అనేది వారు నిర్ణయిస్తారు..దీని మీద కమిటీ వేసి ఇది నీకు తెలుస్తామని తెలుపుకుంటున్నాను అని తెలియ జేశారు.
