మన ధ్యాస నెల్లూరు, మార్చి 28 : నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం తమ్మి నపట్టణ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రి కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ ను వెంటనే తొలగించాలి అని మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం తమ్మిన పట్టణం గ్రామ ప్రజలు విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ….. కోట సతీష్ యాదవ్‌ను కొత్త ప్రభుత్వం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించింది.ఆరు మాసాల్లోనే చైర్మన్ నిజస్వరూపం బయటపడింది.మహిళలతో అసభ్య క్రీడలు, నిధులు దుర్వినియోగం వంటి సోషల్ మీడియాలో బయటకు వైరల్ గా మారినాయి అని అన్నారు.వాటిని చూసి మహిళలు,గ్రామ ప్రజలు అసహించు కుంటూ అని అన్నారు. ఈ కమిటిని వెంటనే తొలగించాలని ఆలయ ప్రతిష్ట దిగజారేల చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని కోరారు.ఈ సతీష్ యాదవ్ ఇంత ముందు కూడా ఒకరి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని నగదు తీసుకొని మోసం చేశాడు అని అన్నారు.ఈ విషయం రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తాము అని పేర్కొన్నారు.సతీష్ యాదవ్ చేసిన పని కి గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అన్నారు. స్త్రీలు దేవాలయానికి పోవాలంటే సిగ్గుపడుతున్నారు, ఇలాంటి వ్యక్తి దేవస్థానం చైర్మన్ పదవి నుండి వెంటనే తొలగించాలి అని అన్నారు.ఈ సమావేశంలో తమ్మిన పట్నం గ్రామ ప్రజలు కే.వెంకటేశ్వర్లు గుమ్మళ్ల దిబ్బ, ఎన్. సుబ్రహ్మణ్యం తమ్మిన పట్నం, బి. సుబ్రహ్మణ్యం గుమ్మళ దిబ్బ, ఏ. వెంకటేశ్వర్లు గుమ్మళ దిబ్బ, ఎం శివయ్య గుమ్మళదిబ్బ, ఎన్. శ్రీనివాసులు తమ్మిన పట్నం, కె.సుధాకర్ గుమ్మళదిబ్బ,కే. వెంకటేశ్వర్లు గుమ్మళదిబ్బ,ఐ. అశోక్ తమ్మిన పట్నం, ఐ కోటయ్య తమ్మిన పట్నం తదితరులు పాల్గొన్నారు.
