బద్వేలు,మన ధ్యాస మార్చి 14:

బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమం బద్వేల్ జనసేన యువతరం నాయకులు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య, దద్దం నాగార్జున మరియు బాల చెన్నయ్య ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు తుడిమెల్ల మురళీ కృష్ణ అధ్యక్షతన జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు మఠం సత్రం చైర్మన్ డి అశోక్, నీటి సంఘం చైర్మన్ కొర్రపాటి సురేంద్ర, ఏఎంసి డైరెక్టర్ చిన్ని సుబ్బారావు పాల్గొన్నారు, మరియు గోపవరం జనసేన నాయకులు పి మనోహర్,శ్రీకాంత్ రెడ్డి బద్వేల్ జనసేన యువ నాయకులు వాయిలేటి శ్రీనివాసులు, తుడిమెళ్ళ సురేంద్ర, మస్తాన్, వంశీకృష్ణ,సింగంశెట్టి సుధీర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *