బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేలు టౌన్‌లోని ఫాతిమా మస్జిద్‌లో కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు అఖండ ఘన స్వాగతం పలికి పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రేమ అభిమానాలతో ఆహ్వానించి నందుకు ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.మసీదుకు సంబంధించి ఎటువంటి అవసరం వచ్చినా తన వంతు సహకారం అందిస్తానని ఆయన అన్నారు.అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు అమీర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓబుళాపురం రాజశేఖర్, చెరుకూరి రవికుమార్,పోరుమామిళ్ళ మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, ఓబుల్ రెడ్డి రమణ రెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, బాదిరెడ్డి వీర రెడ్డి, మున్సిపాలిటీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుంకుల రాంబాబు, పాలకొండ రాజశేఖర్ రెడ్డి, అశోక్ కుమార్ రాజు, సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు. కృష్ణ యాదవ్, ప్రహ్లాదు రెడ్డి, బాలిరెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి, తో పాటు పలువురు టిడిపి నాయకులు,స్థానిక ముస్లిం సోదరులు, మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *