జియ్యమ్మవలస/ మనధ్యాస/మార్చి14:- రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి అన్నారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంతో ప్రేమ ఉందని, అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు.అలాగేగత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నేరుగా రైతు ఖాతాల్లో నగదు జమ అవుతోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి మొత్తం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నాయని వివరించారు.రైతు ముఖాల్లో ఆనందం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని, సరైన సమయంలో పెట్టుబడి సాయం అందడం వల్ల వ్యవసాయంపై రైతులకు భరోసా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, వారికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కురుపాం నియోజకవర్గ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *