విజయవాడ, జనవరి 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె).

విజయవాడలోని రివర్ వ్యూ హోటల్‌లో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది.విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ని ఆహ్వానించి, తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని విధంగా చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని హర్షం వ్యక్తం చేశారు.అలాగే నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు.అలాగే విజయవాడలో నివసిస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.వాటిని సంబంధిత అధికారులు, నాయకులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,ఇంతటి గొప్ప వేదికను ఏర్పాటు చేసిన సందిరెడ్డి నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు ఎల్లవేళలా ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.అలాగే వివిధ ప్రాంతాలలో వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం నివసిస్తూ ఎన్నికలలో నా విజయం కోసం నియోజకవర్గానికి తరలివచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ధన్యవాదాలు తెలిపారు.కూటమి ప్రభుత్వ సహకారంతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,యువ నాయకులు మంత్రి నారా లోకేష్ నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి ఎల్లవేళలా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గెలిచిన రెండేళ్ల కాలంలోనే సుమారు రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *