మన ధ్యాస ,నెల్లూరు డిసెంబర్ 19:ప్రజా క్షేత్రం లో నిరంతరం అందుబాటులో ఉండే ప్రజల మనిషి.. రాజకీయంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగిన సమర్ధుడు…నమ్మిన పక్షాన్ని గెలిపించడంలో వెనుదురుగని వీరుడు… రూప్ కుమార్ యాదవ్ ఇన్చార్జి మేయర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ప్రజల ప్రతి అవసరాన్ని సకాలంలో తీరుస్తున్న కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి,సంక్షేమం కార్పొరేషన్ ప్రజలకి అందించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు..జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కుమార్ కి జనసేన నాయకులను, జనసైనికులను కూడా దిశా నిర్దేశం చేయవలసి చేసి రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పట్టణ కార్యదర్శి హేమచంద్రయాదవ్,డివిజన్ నుంచి నాయకులు నరహరి,వర్షన్,సుధాకర్ ననరహరి,కృష్ణమోహన్ రెడ్డి, అశోక్,శరవణ,మౌనేష్,దావూద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *