మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19:నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీస్ లో శుక్రవారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16 డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి,6వ డివిజన్ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, 51 డివిజన్ కార్పొరేటర్ కాయల సాహిత్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి.. అభినందనలు తెలియజేశారు.పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తామని వారు తెలిపారు.


