మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 19:రాయలసీమ నెల్లూరు జిల్లాలలో కృష్ణా జలాలు ప్రవాహాన్ని తెలంగాణ అభ్యంతరాలు ప్రకృతి ధర్మానికి విరుద్ధం ఉన్నాయని బిజెపి నమామి గంగి రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా పరిగణించాలని కృష్ణ ట్రిబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ వాదనల ప్రజెంటేషన్ అద్భుతంగా వుంది.నదీ జలాలను జాతీయ సంపదగా ప్రకటించాలని రమేష్ తనపై అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్రాల విభజన సమయంలో కృష్ణా జలాలు పెన్నా బేసిన్ కు మళ్లించుకునేందుకు విభజన చట్టం ఆమోదించింది.రాయలసీమ నీటి దుర్భిక్ష ప్రాంతం. 1981 నాటికి ముందే శ్రీశైలం నుండి కృష్ణా జలాలు రాయలసీమలో ప్రవేశిస్తున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం 1988లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. పై ప్రాంతం నుండి నీరు క్రింది ప్రాంతాలకు ప్రవహించడం ప్రకృతి సహజ ధర్మం.తెలంగాణ లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నీటి సహజ సిద్ద ప్రకృతి ధర్మనికి విరుద్ధంగా పోరాటాలు చేస్తున్నాయని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *