మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.శంఖవరం మండలం కత్తిపూడి భాష్యం స్కూల్లో నిర్వహిస్తున్న గ్రిగ్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి,క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె క్రీడలు విద్యార్థుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,నాయకత్వ గుణాలు మరియు సమిష్టి భావనలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.ఇటువంటి క్రీడా పోటీల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ సందర్భంగా
తెలియజేసారు.విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించినప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.విజయ లక్ష్యంతో ముందుకు సాగుతున్న విద్యార్థులందరికీ ఎమ్మెల్యే సత్యప్రభ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు (శివ), సీనియర్ నాయకులు పర్వత సురేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్, కూటమి నాయకులు కృష్ణమూర్తి, మేడిశెట్టి బాబీ,కరణం సుబ్రహ్మణ్యం,గాబు సుభాష్,తలపంటి బుజ్జి, కేళంగి జన, రౌతు శివ,కొయ్యా రమణ, కంచిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *