
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:రైతులకు యూరియా కష్టాలను లేకుండా చేయడానికే యూరియా కార్డు విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు మండలం టి రాయవరం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు యూరియా కార్డులను అధికారికంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులకు రబీ పంటల సాగు సమయంలో ప్రతి ఎకరానికి 3.5 బస్తాల యూరియా ఈ యూరియా కార్డు ద్వారా అందజేయబడుతుందని ఆమె అన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి,సరైన మోతాదులో ఎలాంటి అవకతవకలు లేకుండా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యూరియా కార్డు విధానాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు.అర్హులైన ప్రతి రైతుకు,వారు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి అవసరమైన యూరియా పూర్తిగా పారదర్శకంగా అందించడమే ఈ పద్ధతి ప్రధాన లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు.ఇప్పటి వరకు యూరియా పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను తొలగించి,నకిలీ లేదా అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కార్డు విధానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు తమ ఈ క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకొని,ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ జి శ్రీనివాసరావు,రాష్ట్ర ఖాదీ,గ్రామీణ పరిశ్రమల డైరెక్టర్ కొమ్ముల కన్నబాబు,లంపకలోవ సొసైటీ చైర్మన్ వరుపుల రామకృష్ణ,సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు,కూటమి నాయకులు మేడిశెట్టి బాబీ,తటవర్తి సుబ్బారావు,అడ్డాల త్రిమూర్తులు,కరణం సుబ్రహ్మణ్యం,గాబు సుభాష్ తదితరులు పాల్గొన్నారు..