చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అదేవిధంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం, సాయంకాలం స్వామివారికి గణపతి హోమము, రాత్రి వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని స్వామివారి దర్శనార్థం తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకుంటారని తెలిపారు.







