ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కార్యవర్గం తీర్మానించింది. శనివారం జిల్లా కార్యాలయంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. జర్నలిస్టుల సమస్యలపై రాజి లేని పోరాటం నిర్వహిస్తున్న యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 5వ తేదీ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వేడుకలు నిర్వహించే దిశగా సమావేశం చర్చించింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు యూనియన్ శ్రీకారం చుట్టింది. యూనియన్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశానంతరం చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథకం అంబుడ్స్ మెన్ గా నియమితులైన ఏపీడబ్ల్యూజేఎఫ్ పూర్వ కన్వీనర్ కడియాల వరదరాజులకు జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధరం ఏపీ బీజేఏ అధ్యక్ష కార్యదర్శులు జయచంద్ర చిన్న, కోశాధికారి కృపానందరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి యాదవేందర్ రెడ్డి, సీనియర్ యూనియన్ నాయకులు మురళి, మురళీకృష్ణ, కుబేoద్రన్, సురేందర్ రెడ్డి, బాలసుబ్రమణ్యం విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *