పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

పెనుమూరు, మన ధ్యాస , అక్టోబర్ 16 :
చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రమైన పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి దిశగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన గురువారం రాసిన లేఖలో వివరాలు వెల్లడించారు. బస్టాండు నుంచి సంతగేటు, హై స్కూలు, ప్రాధమిక పాఠశాల, బజారు మీదుగా కార్వేటినగరం వైపు బస్సులు వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండు తూర్పు వైపు నుంచి బజారు అవతల ఉన్న కార్వేటినగరం రహదారి వరకు సుమారు అర కిలోమీటరు (0.5 కి.మీ) మేర బైపాస్ రోడ్డు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఇప్పటికే బస్టాండు నుంచి దాదాపు 150 మీటర్ల రహదారి ఉందని, మిగతా 500 మీటర్ల నిర్మాణం చేస్తే సరిపోతుందని తెలిపారు. ఈ మార్గం మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచి ఉందని, పెనుమూరు తహసీల్దారు ఆరు నెలల క్రితం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారని గుర్తు చేశారు. గతంలో ఈ దారిలో రాకపోకలు జరిగేవని, అయితే ఒక వైసిపి నేత కుటుంబ సభ్యులు వంక, కమ్మవారి మిట్ట (గాండ్ల వారి మిట్ట) కలిపి సుమారు 2.5 ఎకరాల భూమిని ఆక్రమించి దారిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.అధికారులపై వత్తిడి తెచ్చి రహదారి పనులు నిలిపివేస్తున్నారని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసిపి నేతల పెత్తనం కొనసాగుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి పెనుమూరు ప్రజల సమస్యలను పరిష్కరించాలని, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ను కోరారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?