వరికుంటపాడు, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్ )://
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొండరెడ్డిపల్లి పంచాయతీ లోని, జి కొత్తపల్లి గ్రామం పరిధిలోని, గండిపాలెం టు ఉదయగిరి మెయిన్ రోడ్డు నుండి గ్రామంలోకి విద్యుత్తు సరఫరా అవుతున్న స్తంభాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణములో ఏమి జరుగుతుందో అనే ఆలోచనలో బిక్కు బిక్కు మంటున్న గ్రామస్తులు…? వచ్చేది వర్షాకాలం… విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ఏ క్షణంలో కూలిపోతాయని తెలియకుండా ఉన్నాయి. ఎంతోమంది అధికారులు నాయకులు ఆ గ్రామం నుంచి వెళుతూ ఉంటారు కానీ పట్టీ పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైనం. మరమ్మతులకు గురైన ఈ స్తంభాలను చూసి స్థానికులు, బయోందనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మా గ్రామానికి, శిథిలావస్థలో ఉన్నటువంటి స్తంభాలను తీసివేసి నూతన స్తంభాలను ఏర్పాటు చేయమని స్థానికులు కోరుతున్నారు. పాత స్తంభాలను తొలగించకపోతే ఏ క్షణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








