

అప్పసముద్రం దుర్ఘటన బాధిత చిన్నారులకు సీఎం ఆర్థిక సాయం…
చిన్నారుల వైద్య అవసరాలన్నింటికీ భరోసా గా ప్రభుత్వం ఉంటుందన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
ఉదయగిరి సెప్టెంబర్ 17 (మన ద్యాస న్యూస్)://
ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేలుడు కారణంగా తొమ్మిది మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసిందే.ఈ సంఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. దీని ఫలితంగా, బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను ఈ రోజు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో కలసి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తనవంతు సహాయం అందిస్తానని, అలాగే గాయపడిన చిన్నారులకు భవిష్యత్తులో వైద్య అవసరాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే, ప్రభుత్వం తరఫున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీఇచ్చారు.ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని, అలాగే సంబంధిత అధికారులకు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసే విధంగా కఠిన నిబంధనలు చర్యలను తీసుకోవాలని, ఆదేశించారు. గ్రామాలలో జరిగే ఉత్సవాలలో వేడుకలలో తల్లిదండ్రులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అది మనందరి బాధ్యత అని అన్నారు. అలాగే గాయపడిన పిల్లల వైద్య చికిత్స కోసం ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల వెన్నంటి ఉంటుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.